గణతంత్ర వేడుకలపై సమీక్ష సమావేశం

గణతంత్ర వేడుకలపై సమీక్ష సమావేశం

వరంగల్ జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో డీసీపీ అంకిత్ కుమార్‌తో కలిసి కలెక్టర్ అన్ని శాఖల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. వేడుకలు సజావుగా జరిగేలా బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించాలని సూచించారు.