అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి

కోనసీమ: రామచంద్రపురం మండలం భీమక్రోసుపాలెంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని మంత్రి వాసంశెట్టి సుభాష్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అందజేసే పౌష్టికాహార వివరాల గురించి అంగన్వాడీ కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అంగన్వాడీల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు.