మద్యం మత్తులో కింద పడి యువకుడు మృతి
WGL: వరంగల్ పట్టణంలోని శాంతినగర్ కాలనీకి చెందిన మహమ్మద్ అసిఫ్ (32) మద్యం మత్తులో ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందాడు. మద్యం తాగిన మత్తులో రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో పడిపోయి ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి అన్న అంజాద్ పాషా ఫిర్యాదు మేరకు గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.