అనంతపురంలో తలసేమియా కేంద్రం ప్రారంభం

అనంతపురంలో తలసేమియా కేంద్రం ప్రారంభం

ATP: అనంతపురం పాతవూరులోని సీడీ ఆసుపత్రి ఆవరణలో రెడ్ క్రాస్ తలసేమియా డే కేర్ సెంటర్ గురువారం ప్రారంభమైంది. జిల్లా రెవెన్యూ అధికారి మలోల ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రెడ్ క్రాస్ ఛైర్మన్ రామారావు మాట్లాడుతూ.. తలసేమియా చిన్నారులకు సేవ చేయడం గొప్ప విషయమని కొనియాడారు. జిల్లా యంత్రాంగం సహకారం ఎప్పుడూ ఉంటుందని మలోల తెలిపారు.