నేడు మంత్రి కార్యాలయంలో CMRF చెక్కులు పంపిణీ

నేడు మంత్రి కార్యాలయంలో  CMRF చెక్కులు పంపిణీ

KMM: మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేయనున్నారు. కూసుమంచి మండలానికి చెందిన లబ్ధిదారులకు మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్‌ఛార్జ్ తుంబురు దయాకర్ రెడ్డి చెక్కులను ఇస్తారని కాంగ్రెస్ నాయకులు ఓ ప్రకటనలో తెలిపారు. కావున మండల కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులు సకాలంలో హాజరుకావాలని కోరారు.