స్మార్ట్ మీటర్లపై పోరుబాట

NLR: నాడు ప్రతిపక్షంలో ఉన్నటీడీపీ స్మార్ట్ మీటర్లను రద్దు చేస్తామని చెప్పి ఇవాళ స్మార్ట్ మీటర్లకు మద్దతు ఇవ్వడం హేయమైన చర్య అని సీపీఎం నాయకులు శ్రీనివాసులు చెప్పారు. బుచ్చి పట్టణంలోని CPI కార్యాలయంలో స్మార్ట్ మీటర్లపై పోరుబాటు కార్యక్రమం కరపత్రాలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు నష్టం కలుగుతుందన్నారు.