ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించిన ACP

MNCL: పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ప్రతిభ కనబరిచిన బెల్లంపల్లి పట్టణ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులను బెల్లంపల్లి ACP రవికుమార్ శనివారం ప్రత్యేకంగా అభినందించారు. 600 మార్కులకు గాను విద్యార్థులు వావిలాల సాయి త్రిగుణ్ 558, బోడకుంట వర్ష 553 సాధించడం గొప్ప విషయమని తెలుపుతూ శాలువాలతో సన్మానించారు. పాఠశాల సిబ్బంది, యాజమాన్యాన్ని అభినందించారు.