పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

KRNL: దేవనకొండ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి, నాణ్యతను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్, పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించే దిశగా లక్ష్యాన్ని ఎంచుకోవాలని వారికి సూచించారు.