'సీతారాంపురం కాలనీలో సమస్యలు పరిష్కరించండి'
సత్యసాయి: పరిగిలోని సీతారాంపురం కాలనీలో డ్రైనేజీ సమస్యలు, పాముల బెడదతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు పంచాయతీ సెక్రటరీ అరుణకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె శనివారం స్థానిక నాయకులతో కలసి కాలనీలో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. కాలనీ వాసులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. డ్రైనేజీ సమస్యను త్వరగా పరిష్కరించే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.