రూ.4 లక్షల విలువైన ఢిల్లీ మద్యం స్వాధీనం

HYD: ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తీసుకొచ్చిన రూ.4 లక్షల విలువైన నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం బాటిళ్లను ఎస్టీఎఫ్టీ టీం పట్టుకుంది. సీఐ నాగరాజు బృందం నాగిరెడ్డి ఇంటిపై దాడి చేసి బ్లాక్ లేబుల్, రెడ్ లేబుల్, శివాజీ రీగల్ సహా 105 బాటిళ్లను స్వాధీనం చేసుకుంది. పాత కార్లు కొనుగోలు పేరిట మద్యం తరలింపు చేస్తున్న రవీందర్, నాగిరెడ్డి లపై కేసు నమోదు చేశారు.