వాటర్ పైప్‌లైన్‌కు మరమ్మతు పనులు
కృష్ణా: గుడివాడ పెదఎరుకపాడులో త్రాగునీటి సరఫరా కోసం ఉపయోగిస్తున్న ప్రధాన పెద్ద వాటర్ పైప్‌లైన్ పగిలిపోయింది. దీంతో పట్టణంలోని నాలుగు రిజర్వాయర్లకు త్రాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ విషయంపై సమాచారం అందిన వెంటనే MLA రాము కార్యాలయం స్పందించి, బుధవారం తక్షణ చర్యలు చేపట్టారు. తమ సమస్యకు పరిష్కారం చూపిన MLAకు ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.