అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. చమన్‌గంజ్ ప్రాంతంలోని ఐదంతస్తుల భవనంలో చెలరేగిన మంటల్లో చిక్కుకుని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మరణించిన వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్కూట్ కారణమని స్థానికులు తెలిపారు.