ట్రంప్‌ మూల్యం చెల్లించుకోక తప్పదు: ఇరాన్

ట్రంప్‌ మూల్యం చెల్లించుకోక తప్పదు: ఇరాన్

ఖమేనీ మృతిపై ఇరాన్ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజానీ అమెరికాను హెచ్చరించారు. దీనికి అధ్యక్షుడు ట్రంప్ భారీ మూల్యం చెల్లించక తప్పదని, ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేశారు. తాము అనేకమంది అమెరికన్ సైనికులను బంధించామని అన్నారు. మృతుల సంఖ్యపై ట్రంప్ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. ఖమేనీ మరణం సాధారణ విషయం కాదని, తగిన బదులిస్తామని ఎక్స్‌లో పేర్కొన్నారు.