'ఇకనైనా ప్రభుత్వం దోమల నివారణకు చర్యలు చేపట్టాలి'

'ఇకనైనా ప్రభుత్వం దోమల నివారణకు చర్యలు చేపట్టాలి'

HYD: నాగోల్‌లో దోమల బెడద భరించలేక దోమతెర కప్పుకుని విధులు నిర్వహిస్తున్న వాచ్‌మెన్ వీడియోపై యజమాని శైలజ స్పందించారు. సెక్యూరిటీ గార్డుల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికే ఈ వీడియో తీసినట్లు ఆమె తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నగరవ్యాప్తంగా ఫాగింగ్ చేయాలని, దోమల నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ వీడియో వైరల్‌గా మారి చర్చకు దారితీసింది.