ట్రాక్టర్ - కారు ఢీ.. తప్పిన ప్రమాదం
NRPT: ట్రాక్టర్‌ను కారు ఢీ కొట్టిన ఘటన శనివారం రాత్రి మరికల్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాలు ప్రకారం.. జాతీయ రహదారి 167పై మండలంలోని పెద్ద చింతకుంట గ్రామ స్టేజి దగ్గర MBNR నుంచి మరికల్ వైపు వెళ్తున్న కారు భారీకేడ్‌ను క్రాస్ చేస్తుండగా ట్రాక్టర్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ సంఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు.