VIDEO: ప్రజల నరకయాతన.. పల్లె దవాఖానకు దారేది..?

MHBD: ఈదులపూసపల్లి YSR కాలనీ రోడ్డు దయనీయంగా మారింది. పల్లె దవాఖాన వెళ్లే దారి బురదమయమై గ్రామస్తులు నరకయాతన అనుభవిస్తున్నారు. చికిత్స కోసం వెళ్తున్న వారికి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండటం వల్ల వ్యాధుల ముప్పు పెరుగుతోంది. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు సరిచేసి, నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.