మండుతున్న మట్టి ధర
WGL: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించడంతో మట్టి ధరలు మండుతున్నాయి. పర్వతగిరి మండల కేంద్రంలోని పెద్ద చెరువు రిజర్వాయర్‌లో మట్టి తవ్వకాలు చేపడుతూ ఇళ్లకు సరఫరా చేస్తున్నారు. ట్రిప్పు మట్టి ఏకంగా రూ.5 వేలకు విక్రయిస్తున్నారు. గతంలో బయట కొనుగోలు చేసిన సమయంలో ట్రిప్పుకు రూ.4,000 విక్రయించగా, ప్రస్తుతం రిజర్వాయర్ నుంచి ఉచితంగా మట్టి, అధిక ధరలకు అమ్ముతున్నారు.