'సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపించాలి'
BHNG: మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఇవాళ ఆలేరు 4వ వార్డులో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే సీపీఐ(ఎం) అభ్యర్థి మొరిగాడి భాగ్యలక్ష్మిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆమె గెలుపు కోరుతూ ర్యాలీ నిర్వహించి, ఇంటిటి ప్రచారం చేశారు.