'ఈశ్వర్ మరణానికి రేవంత్, రాహుల్ కారణం'
TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వుషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి మోసం చేసిందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆరోపించారు. దీనిని తట్టుకోలేక శ్రీసాయి ఈశ్వర్ ఆత్మహత్య చేసుకున్నాడని, ఈశ్వర్ మృతికి CM రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా కారణమని మండిపడ్డారు. BC రిజర్వేషన్ల పేరుతో చేసిన మోసానికి నిండు ప్రాణం బలైందని ఆవేదన వ్యక్తం చేశారు.