VIDEO: నేరరహిత సమాజమే లక్ష్యం.. ఎస్పీ ప్రతిజ్ఞ
SRPT: నేరరహిత సమాజమే లక్ష్యంగా ఎస్పీ నరసింహ సమక్షంలో ప్రజలు కంకణబద్ధులయ్యారు. ఈరోజు సూర్యాపేట కొత్త బస్టాండ్ వద్ద మత్తుకు దూరంగా, చట్టాన్ని గౌరవిస్తామని సామూహిక ప్రతిజ్ఞ చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి పౌరుడూ బాధ్యతగా ఉండాలని, యువత సామాజిక మార్పులో భాగస్వాములు కావాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం స్థానికుల్లో స్ఫూర్తిని నింపింది.