దేవనకొండ పంచాయతీ ఇంఛార్జ్‌గా రాముడు యాదవ్
KRNL: దేవనకొండ గ్రామపంచాయతీకి రాముడు యాదవ్ ఇంఛార్జ్ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత కార్యదర్శి రఫీ డిప్యూటీ ఎంపీడీవోగా పదోన్నతి పొందడంతో, తెర్నేకల్ గ్రామ కార్యదర్శిగా పనిచేస్తున్న రాముడు యాదవ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రజా సేవను ప్రాధాన్యంగా తీసుకుని గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన అన్నారు.