వాటర్ ఫాల్స్ పరిశీలించిన డీఆర్డీఏ పీడీ
PPM: సాలూరు మండలం తోణం వాటర్ ఫాల్స్‌ను మన్యం జిల్లా డీఆర్డీఏ పీడీ ఏం. సుధారాణి మంగళవారం పరిశీలించారు. గ్రామస్తులు స్వచ్ఛందంగా చేపట్టిన అభివృద్ధి పనులు పరిశీలించారు. పర్యాటకులు వాటర్ ఫాల్స్‌ను దాటడానికి వేసిన ఎదురు కర్రలతో ఏర్పాటు చేసిన బ్రిడ్జిను, విశ్రాంతి తీసుకోవడం కోసం ఏర్పాటు చేసిన ప్రదేశాలను పరిశీలించి, తగు సూచనలు చేసారు.