చల్లపల్లి ప్రత్యేక అధికారిగా మచిలీపట్నం డీఎల్‌పీవో

చల్లపల్లి ప్రత్యేక అధికారిగా మచిలీపట్నం డీఎల్‌పీవో

NTR: చల్లపల్లి గ్రామ పంచాయితీ ప్రత్యేక అధికారిగా మచిలీపట్నం డీఎల్‌పీవో మహమ్మద్ రజావుల్లా బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆయన తన బాధ్యతలు చేపట్టారు. గ్రామ పంచాయతీ ఈవో పీవీ.మాధవేంద్రరావు బాధ్యతలు అప్పగించారు. టీడీపీ నాయకులు ముమ్మనేని నాని, వేముల హరికృష్ణ ఆయనను సత్కరించారు.