ఎయిమ్స్ డైరెక్టర్‌గా అమితా అగర్వాల్ బాధ్యతల స్వీకరణ
BHNG: బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్‌గా అమితా అగర్వాల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ డైరెక్టర్‌గా పనిచేసిన వికాస్ భాటియా బదిలీపై వెళ్లగా అమె పూర్తిస్థాయి డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అమితా అగర్వాల్‌కు ఎయిమ్స్ అధ్యాపకులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎయిమ్స్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.