నంద్యాలలో భార్యను హత్య చేసిన భర్త

NDL: నంద్యాలలోని ఎన్జీవో కాలనీలో ఇవాళ ఉదయం దారుణం చోటుచేసుకుంది. పట్టణంలో పౌరోహిత్యం చేసిన జీవనం సాగిస్తున్న సాయినాథ్ శర్మ కట్టుకున్న భార్య శిరీషను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. భార్య శిరీష పెద్ద మొత్తంలో అప్పులు చేయడంతో ఇద్దరూ పరస్పరం గొడవపడగా, క్షణికావేశంలో హత్య చేసినట్లు తెలుస్తోంది. అనంతరం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం.