10th పబ్లిక్ ఎగ్జామ్స్.. సెంటర్లను గుర్తించండిలా..!

10th పబ్లిక్ ఎగ్జామ్స్.. సెంటర్లను గుర్తించండిలా..!

అన్నమయ్య జిల్లాలో రేపటి నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షల కోసం విద్యార్థులకు ప్రభుత్వం సరికొత్త సౌకర్యాన్ని కల్పించింది. పరీక్ష కేంద్రాలను సులభంగా గుర్తించేందుకు వీలుగా హాల్ టికెట్లలో QR కోడ్‌ను ముద్రించారు. ఈ కోడ్‌ను ఫోన్‌లో స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం చిరునామా, రూట్ మ్యాప్, ఫొటోలు అందుబాటులో ఉంటాయని జిల్లా అధికారి శ్రీనివాసరాజు తెలిపారు.