ఖమ్మం-దేవరపల్లి హైవేపై కొత్త రూల్స్.. వాటికి నో ఎంట్రీ

ఖమ్మం-దేవరపల్లి హైవేపై కొత్త రూల్స్.. వాటికి నో ఎంట్రీ

తూ.గో: ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌ వేపై సోమవారం నుంచి టోల్ వసూళ్లు ప్రారంభమయ్యాయి. ట్రయల్ రన్ ముగియడంతో వైరా (M) ఎంట్రీ పాయింట్ నుంచి దేవరపల్లి వరకు అధికారికంగా టోల్ వసూలు చేస్తున్నారు. అయితే సోమవారం నుంచి ఈ మార్గంలో టూ, త్రీ వీలర్ వాహనాలకు అనుమతి లేదని హైవే వర్గాలు స్పష్టం చేశాయి. కేవలం భారీ వాహనాలు, కార్లకు మాత్రమే అనుమతి ఉంటుంది.