జమ్మిచేడి జమ్మలమ్మ అద్భుత రూపం
GDWL: గద్వాల జిల్లాలో కొలువైన జమ్మిచెడు జమ్ములమ్మ అమ్మవారికి ఇష్టమైన రోజు శుక్రవారం కావడంతో, ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆకు పూజ, హోమం, నది జలాలతో అభిషేకం వంటి పూజా కార్యక్రమాలు జరిపారు. శుక్రవారం సందర్భంగా అమ్మవారి అలంకరణ ఎంతో అద్భుతంగా ఉందని భక్తులు కొనియాడారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు