మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే కూన

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే కూన

శ్రీకాకుళం పట్టణం శాంతి నగర్ కాలనీలో ఎమ్మెల్యే కూన రవికుమార్ ఇంటి ముందు జరిగిన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను ఆయన వెంటనే తన కారులో ఆసుపత్రికి తరలించారు. ప్రమాద విషయం సీఐకి తెలియజేసిన ఆయన, హాస్పిటల్‌కు వెళ్లి బాధితులను పలకరించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.