కల్వర్టును పరిశీలించిన మాజీ Mpp

కల్వర్టును పరిశీలించిన మాజీ Mpp

ADB: గాదిగూడ మండలంలోని చిత్తగూడ, బొడ్డిగూడ గ్రామాలకు వెళ్లే మార్గంలో ఉన్న కల్వర్టు భారీ వర్షానికి కొట్టుకుపోయింది. ఈ క్రమంలో ఆదివారం మాజీ వైస్ ఎంపీపీ యోగేష్ కల్వర్టును పరిశీలించారు. ప్రజలు ఆవేదన చెందాల్సిన అవసరం లేదని, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి మరమ్మతుల కోసం కృషి చేస్తామని హామిచ్చారు. భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.