ఈ నెల 13న మెగా జాబ్ మేళా

SDPT: సిద్దిపేటలో ఈనెల 13న భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఇది ఒక మంచి అవకాశమని పేర్కొన్నారు. "యువత తమ ఆశయాలను సాధించుకోవాలంటే పరిమితులను దాటి ముందుకు రావాలి. కేవలం సిద్దిపేటలోనే ఉండాలనే ఆలోచన నుంచి బయట పడాలి" అని పిలుపునిచ్చారు.