సచివాలయ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
కోనసీమ: సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేదిపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రారంభించారు. గ్రామ సచివాలయం ద్వారా ప్రభుత్వ అందిస్తున్న సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు.