'మహిళల రక్షణ కోసం సిద్ధంగా పోలీస్'

ELR: ఆగిరిపల్లిలోని పోలీస్ స్టేషన్‌లో మహిళలకు సోమవారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎస్సై శుభ శేఖర్ మాట్లాడుతూ.. మహిళల రక్షణ కోసం పోలీసు వ్యవస్థ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందన్నారు. మహిళలపై ఈవ్ టీజింగ్, దాడులు, గృహహింస, ఆన్‌లైన్ మోసాలు వంటి విషయాలలో బాలికలు, మహిళలు తగిన జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. బాలికలు, మహిళల రక్షణ కోసం పోలీస్ సిద్ధంగా ఉన్నారని అన్నారు.