సేవకు పర్యాయపదమే భగవాన్ శ్రీ సత్య సాయి: మంత్రి కందుల
E.G: రాజమండ్రి శ్రీ సత్యసాయి గురుకులం పాఠశాలలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలలో మంత్రి కందుల దుర్గేష్ బుధవారం పాల్గొన్నారు. సేవకు పర్యాయపదం, ప్రతిరూపం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అని అన్నారు. ఆయన ప్రవచనాలని బోధించడమే కాకుండా, వైద్యాలయాలు, విద్యాలయాలు స్థాపించి, నీటి వసతి లేని మెట్ట ప్రాంతాల వరకు మంచినీటి సౌకర్యాన్ని కల్పించారన్నారు.