భీమేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా సంప్రోక్షణ పూజలు

భీమేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా సంప్రోక్షణ పూజలు

కోనసీమ: రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో బుధవారం సకుటుంబ సపరివార సమేతంగా సంప్రోక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, సునీత దంపతులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. గుడి సంప్రోక్షణ కార్యక్రమాన్ని ప్రధాన అర్చకులు, అర్చక వర్గం ఘనంగా నిర్వహించారు.