నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్
సత్యసాయి: ఓబులదేవరచెరువు మండలంలోని విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ గౌరీ శంకర్ తెలిపారు. ఓడీసీ పట్టణం, రూరల్ ప్రాంతాల్లో శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి, సహకరించాలని కోరారు.