ఫ్యాన్‌కు ఉరివేసుకుని విద్యార్థిని ఆత్మహత్య

ఫ్యాన్‌కు ఉరివేసుకుని విద్యార్థిని ఆత్మహత్య

కడప జిల్లా చింతకొమ్మదిన్నెలో విషాదం చోటు చేసుంది. 9వ తరగతి చదువుతున్న జస్వంతి అనే విద్యార్థిని హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని సోమవారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది. గమనించిన తోటి విద్యార్థులు హాస్టల్ వార్డన్‌కు తెలియజేయగా అప్పటికే బాలిక మృతి చెందింది. కాగా, మృతికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.