నెల్లూరు పంచాయతీల కొత్త లెక్క.. 700కు చేరిన సంఖ్య!
నెల్లూరు జిల్లాలో గ్రామ పంచాయతీల సంఖ్య 700కు చేరింది. కందుకూరు నియోజకవర్గంలోని 5 మండలాల (92 పంచాయతీలు)ను తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపారు. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలోని గూడూరు, కోట, చిల్లకూరు మండలాల (70 పంచాయతీలు)ను నెల్లూరు జిల్లాలో విలీనం చేశారు. ఈ మార్పులతో జిల్లా రూపురేఖలు మారిపోయాయి.