ఘనంగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

ఘనంగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

JGL: మల్లాపూర్ మండల కేంద్రంలో వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో లక్ష్మి-వెంకటేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద మంత్రాల మధ్య స్వామి, అమ్మవార్లకు వస్త్ర సమర్పణ, మాంగల్య ధారణ, తలంబ్రాలు, పూర్ణా హుతి కార్యక్రమాలను జరిపించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.