'ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి'
SRCL: రహదారి భద్రత నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలని స్థానిక ఎస్సై రమేష్ అన్నారు. చందుర్తి మండల కేంద్రంలో గురువారం రోడ్డు భద్రతపై అవగాహన నిర్వహించారు. ఎస్సై మాట్లాడుతూ.. సీటు బెల్ట్, హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలన్నారు. చిన్న నిర్లక్ష్యాలే కుటుంబానికి పెద్ద దిక్కును దూరం చేస్తాయన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.