పేకాట శిబిరంపై దాడి.. ఐదుగురు నిందితులు అరెస్ట్

పేకాట శిబిరంపై దాడి.. ఐదుగురు నిందితులు అరెస్ట్

ప్రకాశం: ఒంగోలులోని వంట వారి కాలనీ వద్ద ఓ పేకాట స్థావరంపై దాడులు నిర్వహించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు వన్ టౌన్ సీఐ నాగరాజు తెలిపారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు అందిన సమాచారం మేరకు పేకాట ఆడుతున్న ఐదుగురిని గుర్తించి అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.4500 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.