షేక్ గౌసియా కుటుంబానికి సేవా సమితి సాయం
KRNL: ఆదోనిలో విక్టరీపేటకు చెందిన షేక్ గౌసియా అనారోగ్యంతో కర్నూలు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. ఆమె పార్థివ దేహానికి టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు గుడిసె శ్రీరాములు, పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గుడిసె కృష్ణమ్మ సేవా సమితి తరఫున ఖర్చుల కోసం కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు.