VIDEO: రోజాకు రేవంత్ రెడ్డి షేక్ హ్యాండ్
TG: రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంటు ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మాజీ మంత్రి రోజా ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని నవ్వుతూ పలకరించుకున్నారు. ఈ క్రమంలో కాసేపు ముచ్చటించారు. ఎలా ఉన్నారు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించగా.. 'ఫైన్ అండి' అంటూ రోజా బదులిచ్చారు.