విద్యార్థినిని కొట్టిన టీచర్‌పై కేసు నమోదు
SRCL: విద్యార్థినిని కొట్టిన టీచర్‌పై కేసు నమోదు చేసినట్లు తంగళ్ళపల్లి ఎస్సై ఉపేంద్ర చారి తెలిపారు. తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్‌లో గురువారం ఆయన మాట్లాడారు. మండలంలోని జిల్లెల్లలోని విజ్ఞాన విద్యానికేతన్ స్కూల్ టీచర్ రెండవ తరగతి చదువుతున్న ఎండి సోఫియాను టీచర్ కర్రతో కొట్టిందన్నారు. విద్యార్థినికి తీవ్ర గాయాలు కాగా, విద్యార్థుని తండ్రి గౌస్ ఖాన్ ఫిర్యాదు చేశాడని ఎస్సై తెలిపారు.