హనుమంత్ రెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నీటి విడుదల

NZB: కమ్మర్ పల్లి మండలంలోని చౌటుపల్లి హనుమంత్ రెడ్డి ఎత్తిపోతల పథకం పైపులైన్ ద్వారా శుక్రవారం హసకోత్తూర్, చౌట్‌పల్లి చెరువులకు నీరు విడుదల చేశారు. ఈ పథకం ద్వారా నీటిని విడుదల చేయడానికి సహకరించిన నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.