ALERT: రాష్ట్రానికి భారీ వర్ష సూచన

AP: పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల్లో అల్పపీడనం, అనుబంధంగా ద్రోణి విస్తరించిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది. శ్రీకాకుళం, కోనసీమ, గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, GTR, బాపట్ల, KNL, NDL జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షం, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు.