సిమ్ బ్లాక్ చేసి.. లక్షలు మాయం

KRNL: హాలహర్వి మండలానికి చెందిన మల్లికార్జున, హొళగుంద మండలానికి చెందిన మరో యువకుడు సైబర్ మోసగాళ్ల ఉచ్చులో చిక్కున్నారు. మల్లికార్జున బళ్లారిలోని HCFC బ్యాంకులో ఖాతా తెరిచి రూ. 16 లక్షల రుణం తీసుకున్నారు. ఈ నెల 15న ఖాతాలో రూ.11. 80 లక్షలు ఉండగా, సిమ్ బ్లాక్ చేసి నెమ్మదిగా నగదు మాయం చేశారు. పోలీసుల విచారణలో యూపీకి చెందిన వారు మోసం చేసినట్లు తెలిపారు.