పాఠశాల నూతన భవనానికి శంకుస్థాపన

BPT: నగరం మండలం సజ్జావారిపాలెం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నూతన భవన నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు అనగాని శివప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నూతన భవనం విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని అందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.