VIDEO: వల్లూరు జాతరలో వింత ఆచారం ..!
కడప జిల్లా వల్లూరు అంకాలమ్మ జాతర 3 రోజులు అంగరంగ వైభవంగా జరిగింది. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని వారి మొక్కులు చెల్లించుకున్నారు. చివరి రోజు కావడంతో కోర్ల బండికి పంది పిల్ల, గొర్రెపిల్ల, మేక పిల్ల, కోడి పిల్లలను కట్టి అమ్మవారి ఉగ్రహంతో ఒక మహిళను ఆ బండిపై ఎక్కించి గుడి చుట్టూ తిప్పారు. బండికి జంతువులను కట్టడం ఆనవాయితీగా వస్తుందని గ్రామస్థులు తెలిపారు.