చెరువులో పడి ఇద్దరు యువకుల మృతి
PLD: దాచేపల్లి(M) మాదినపాడు శివారు సారంగపల్లి అగ్రహారంలో విషాదం జరిగింది. ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి చెందారని స్థానికులు తెలిపారు. తమ గొర్రెలను కడిగేందుకు వీరు స్థానిక చెరువు వద్దకు వెళ్లారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడిపోయారు. ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు ఇద్దరూ అదే గ్రామానికి చెందినవారు.